Samantha | సినిమాల్లోకి రాకముందు సమంత అలాంటి పనులు చేసిందట..!
Actress Samantha | ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Actress Samantha | ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఉత్తరాదిన కూడా పలు ప్రాజెక్ట్‌లను చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో సమంత టాప్-3లో ఉంది. ఇటీవలే ఈమె నటించిన యశోద రిలీజై భారీ వసూళ్లను సాధిస్తుంది.
ఇక సమంత సినిమాల్లోకి రాకముందు చాలా కష్టాలు పడిందట. 14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని సమంత తాజాగా ఓ ఇంటర్వూలో తెలిపింది. మ్యారేజ్ ఫంక్షన్లలో వెలకమ్ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని గెస్ట్‌లకు వెల్కమ్ చెబితే రూ.800 నుండి రూ.1000 ఇచ్చేవారని చెప్పింది. పొద్దున చదువుకుని.. సాయంత్రం పనిచేసేదాన్ని అంటూ పాత రోజుల్ని గుర్తుచేసుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సమంత, ఏమాయ చేశావే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’, ‘ఖుషీ’ సినిమాలు చేస్తుంది.
ఇటీవలే సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన పడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఇటీవలే యశోద ప్రమోషన్లో చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

