Samantha | మహిళలు ఎదుగుతున్నారు..!! సమంత ఆసక్తికర ట్వీట్
పురుషులకు మహిళలు ఏమాత్రం తీసుపోరు అని నిరూపిస్తున్నారు మన స్టార్ కథానాయికలు. అన్నిట్లోనూ హీరోలకు పోటీ ఇస్తూ.. దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు సినిమా అంటే స్టార్ హీరో అనే మాట వినిపించేది. ఇప్పుడు హీరోలకు ధీటుగా హీరోయిన్లు కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సమంత, నయనతార, అనుష్క వంటి స్టార్ కథానాయికలు లేడీ ఓరియెంటెడ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయన్‌కు సౌత్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను నటించిన చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనకపోయినా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Samantha | పురుషులకు మహిళలు ఏమాత్రం తీసుపోరు అని నిరూపిస్తున్నారు మన స్టార్ కథానాయికలు. అన్నిట్లోనూ హీరోలకు పోటీ ఇస్తూ.. దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు సినిమా అంటే స్టార్ హీరో అనే మాట వినిపించేది. ఇప్పుడు హీరోలకు ధీటుగా హీరోయిన్లు కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సమంత, నయనతార, అనుష్క వంటి స్టార్ కథానాయికలు లేడీ ఓరియెంటెడ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయన్‌కు సౌత్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను నటించిన చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనకపోయినా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా నయన్ నటించిన ‘కనెక్ట్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నయన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన ఓ నెటిజన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ‘కనెక్ట్’ మూవీకి సంబంధించి ఏర్పాటు చేసిన భారీ బ్యానర్స్, కటౌట్స్, హోర్డింగ్‌లకు సంబంధించిన చిత్రాలు ట్విట్టర్లో పోస్టు చేస్తూ… ఒక హీరోయిన్ చిత్రానికి ఈ స్థాయిలో హోర్డింగ్ ఏర్పాటు చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
పదేళ్ల క్రితం ఈ పరిస్థితి హీరోయిన్లకు లేదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు ధీటుగా హీరోయిన్ చిత్రాలు వస్తున్నాయి అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నటి సమంత స్పందించింది. ‘మహిళలు ఎదుగుతున్నారు (Women Rising!!)’ అంటూ నెటిజన్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
🫶🏻🫶🏻🫶🏻🫶🏻
Women Rising!! https://t.co/qR3N3OozK8— Samantha (@Samanthaprabhu2) January 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

