గూఢచారిగా సమంత

‘ఫ్యామిలీమ్యాన్-2’ సిరీస్‌లో తమిళ రెబెల్ రాజీ పాత్రలో విలక్షణ అభినయాన్ని కనబరిచి మెప్పించింది సమంత. ఈ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్నదామె. తాజాగా హిందీలో మరో చక్కటి అవకాశాన్ని దక్కించుకున్నది సమంత. ‘ఫ్యామిలీమ్యాన్’ దర్శకద్వయం రాజ్-డీకే ‘సిటాడెల్’ పేరుతో కొత్త వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ సిరీస్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సిరీస్ ద్వారా తొలిసారి వీరు జోడీకట్టబోతుండటం గమనార్హం. ఇందులో వరుణ్ ధావన్, సమంత గూఢచారులుగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇద్దరి పాత్రలు శక్తివంతంగా ఉంటాయని చెబుతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సిరీస్‌లో పోరాట ఘట్టాలకు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ పనిచేయబోతున్నట్లు తెలిసింది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సమంత, వరుణ్‌ధావన్ విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఈ సిరీస్ సెట్స్‌పైకిరానున్నట్లు సమాచారం. ఇదే సిరీస్ హాలీవుడ్‌లోనూ రూపొందనున్నది. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రను పోషిసున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

