Samantha | మంచులో మెరిసిన సమంత.. గ్లామర్‌తో పాటు తన ఆలోచనలతోనూ ఆకట్టుకున్న టాలీవుడ్ క్వీన్!
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ప్రముఖ మ్యాగజైన్ “ది నాడ్” మే 2026 ఎడిషన్ కోసం సమంత చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గ్లామర్, ఎలిగెన్స్, స్టైల్ అన్నీ కలిసిన ఈ ఫోటోషూట్‌లో సమంత పూర్తిగా కొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఫిదా చేస్తున్నారు.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ప్రముఖ మ్యాగజైన్ “ది నాడ్” మే 2026 ఎడిషన్ కోసం సమంత చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గ్లామర్, ఎలిగెన్స్, స్టైల్ అన్నీ కలిసిన ఈ ఫోటోషూట్‌లో సమంత పూర్తిగా కొత్త అవతారంలో కనిపించి అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఈ షూట్లో సమంత ధరించిన ప్రతి అవుట్‌ఫిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా డీప్ నెక్ డిజైన్‌తో ఉన్న మెటాలిక్ మెష్ గౌన్‌లో ఆమె లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మంచు నేపథ్యంతో చేసిన ఈ ఫోటోషూట్‌లో సమంత ఒక దేవకన్యలా కనిపించారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. డ్రెస్‌కు జత చేసిన అద్దాల టాసెల్స్, స్టైలిష్ మేకోవర్ మొత్తం షూట్‌కు ఒక డ్రామాటిక్ టచ్ ఇచ్చాయి.
ఇక మరో లుక్‌లో ఐవరీ కలర్ ముత్యాల డ్రెస్‌లో సమంత మరింత గ్రేస్‌ఫుల్‌గా మెరిసిపోయారు. ప్రత్యేకంగా చేత్తో కుట్టిన ముత్యాలతో డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌కు బుల్గారీ జ్యువెలరీ, రెనే కావిల్లా ఫుట్‌వేర్ జత కావడంతో ఆమె లుక్ మరింత రిచ్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ “సామ్ అంటే స్టైల్‌కు మరో పేరు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఫోటోషూట్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. ఈ సందర్భంగా సమంత చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. “ఈ సినిమాలో హీరో ఎవరు?” అని అడిగితే.. “నేను ఇకపై అలాంటి సినిమాలు చేయడం లేదు” అంటూ సమంత కూల్‌గా సమాధానం ఇచ్చారు. తాను ఎంచుకునే సినిమాల్లో కథే అసలైన హీరో అని, నటుల కంటే కథకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
మహిళల భావోద్వేగాలు, ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండే పాత్రలనే ఇప్పుడు ఎంపిక చేసుకుంటున్నానని సమంత వెల్లడించారు. సినిమా ప్రపంచంలో మార్పు రావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. సమంత మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే, సమంత నటిస్తున్న కొత్త చిత్రం మా ఇంటి బంగారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్-ఫ్యామిలీ డ్రామాను సమంత స్వయంగా తన ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో సమంత కొత్త పెళ్లికూతురిగా కనిపించనుండగా, ఆమె పాత్ర వెనుక ఉన్న బలమైన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

