Samantha – Naga Chaitanya | టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు పొందిన సమంత (Samantha), అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమా చేస్తుండగా.. సమంత సిటడెల్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీసెంట్గా సమంత నెటిజన్లతో ముచ్చటించగా.. ఓ నెటిజన్ సమంతను ట్యాగ్ చేస్తూ.. సమంత గారు మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు..? అంటూ కామెంట్ పెట్టాడు. అయితే ఈ ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చింది సమంత.
సమంత బదులిస్తూ.. సారీ ఇలాంటి ఆరోపణలు చేయడం మీకు మంచిది కాదు. మీకు ఇంకా బలమైనవి కావలి. మీ ఆలోచనల్లో మార్పు రావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ సామ్ కామెంట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.