Citadel | ‘సిటాడెల్’ కు డబ్బింగ్ మొదలుపెట్టిన సమంత.. ఫొటోలు వైరల్
Samantha | అగ్ర కథానాయిక సమంత, బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ (Citadel). ఈ సిరీస్‌కు ఫ్యామిలీ మ్యాన్ (Family Man) ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj And Dk) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలుకాగా సామ్ అనారోగ్య సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
Samantha | అగ్ర కథానాయిక సమంత, బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ (Citadel). ఈ సిరీస్‌కు ఫ్యామిలీ మ్యాన్ (Family Man) ఫేమ్ రాజ్ అండ్ డీకే(Raj And Dk) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలుకాగా సామ్ అనారోగ్య సమస్యల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అలాగే సమంత కూడా తన పాత్రకు డబ్బింగ్ కూడా మొదలుపెట్టిందని మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించి ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక ఈ ఫొటోలలో సామ్ డబ్బింగ్ చెబుతున్నట్లు ఉండగా.. మరో ఫొటోలో వరుణ్‌ధావన్, సామ్, రాజ్ అండ్ డీకే కలిసి ‘సిటాడెల్’ రషెస్ చూస్తున్నట్లు ఫొటో ఉంది.
ఇక శాకుంతలం వంటి డిజాస్టర్ తర్వాత సామ్ ‘సిటాడెల్’ (Citadel)తో రానుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా ‘సిటాడెల్’ రానుంది. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్2’లో నెగెటివ్ రోల్లో అలరించిన సామ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌లో అదరగొడుతుందని టాక్.
.@Samanthaprabhu2 has started dubbing for Raj & Dk project #Citadel #SamanthaRuthPrabhu pic.twitter.com/DZ0NAeLUn9
— Cinema Mania (@ursniresh) January 30, 2024
Dubbing started #Samantha #Citadel #SamanthaRuthPrabhu@Samanthaprabhu2 🔥💗 pic.twitter.com/phNSoeeIa5
— SamanthaRuthPrabhu Update (@SamUpdate1) January 30, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

