ఆ యువ దర్శకుడెవరు?
కెరీర్ పరంగా ఎక్కువ గ్యాపే తీసుకుంది సమంత. ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ఈ విలువైన సమయాన్నంతా కేటాయించింది. ఎట్టకేలకు మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నది. అది కూడా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా. ఇటీవలే ‘మా బంగారుతల్లి’ అనే సినిమా పేరు కూడా తన ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది సమంత.
కెరీర్ పరంగా ఎక్కువ గ్యాపే తీసుకుంది సమంత. ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ఈ విలువైన సమయాన్నంతా కేటాయించింది. ఎట్టకేలకు మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నది. అది కూడా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా. ఇటీవలే ‘మా బంగారుతల్లి’ అనే సినిమా పేరు కూడా తన ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది సమంత. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇదిలావుంటే.. అసలు ఈ సినిమాకు దర్శకుడెవరు? అనేది సమంత అభిమానుల్లో నెలకొన్న ప్రశ్న. ఓ యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ఈ కథ కూడా అతనిదే అని సమాచారం. త్వరలోనే ఆ దర్శకుడి పేరును సామ్ ప్రకటించనుంది. ఇందులోని తన పాత్ర గురించి ఆమె చెబుతూ ‘నటిగా నన్ను మరోస్థాయిలో నిలబెట్టే సినిమా ఇది. ఇందులో కొత్త సమంతను చూస్తారు. ఇందులో నేనే హీరో. నటిగా నాకొక సవాల్ ఈ సినిమా. మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తా’ అని సామ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

