శాకుంతలం విడుదల వాయిదా
సమంత ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘శాకుంతలం’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘శాకుంతలం’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయలేకపోతున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామన్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇతర పాత్రలను మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి
తదితరులు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

