Shaakuntalam Movie | బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది.. శాకుంతలం సినిమాపై సామ్ రివ్యూ
Shaakuntalam Movie Review | 'యశోద' వంటి యాక్షన్ సినిమా తర్వాత 'శాకుంతలం' లాంటి పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది.
Shaakuntalam Movie Review by samantha | ‘యశోద’ వంటి యాక్షన్ సినిమా తర్వాత ‘శాకుంతలం’ లాంటి పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం అడుగుడుగున అడ్డంకులే ఎదురయ్యాయి. ఇప్పుడోస్తుంది.. అప్పుడోస్తుంది అంటూ పలుసార్లు డేట్లను కూడా వాయిదా వేశారు. ఏప్రిల్ 14న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేసింది. కాగా తాజాగా సామ్.. శాకుంతలం సినిమాను చూసింది. అనంతరం ఇన్‌స్టాలో రివ్యూ పోస్ట్ చేసింది.
శాకుంతలం చూశానని, సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పింది. మన పురాణాల్లో గొప్ప కథల్లో ఒకటైన శాకుంతలం కథకు గుణశేఖర్ గారు ప్రాణం పోశారు. బలమైన భావోద్వేగాలతో రూపొందిన చిత్రమిది. కుటుంబ ప్రేక్షకులు ఆ భావోద్వేగాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. పిల్లలంతా ఈ మ్యూజిక్ వరల్డ్‌ను ప్రేమిస్తారు. ఫ్యామిలీ ఆడియోన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్‌ను ఆస్వాధిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన జర్నీని ఎప్పటికి మర్చిపోను. ఇలాంటి అద్భుతమైన సినిమాలో నన్ను భాగం చేసినందుకు దిల్‌రాజు, నీలిమా గుణలకు థాంక్స్ అంటూ సామ్ పోస్ట్ చేసింది.
మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్ర పోషించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రుద్రమ దేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మాలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

