Samantha: రాజీ పాత్రకు ముంబైలో అవార్డ్ అందుకున్న సమంత

నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆమెకు వరుస సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషలలోను తలుపు తడుతున్నాయి. ఏకంగా హాలీవుడ్ చిత్రంలోనే సమంత నటిస్తోంది. ఓ బేబీ నిర్మాతతో మరోసారి సమంత జతకట్టేసింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో సమంత బై సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించబోతోందట. ఇక యశోద అనే పాన్ ఇండియా చిత్రంలోను సామ్ నటిస్తుంది.
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంతకు సౌత్‌తో పాటు నార్త్‌లోను మంచి క్రేజ్ పెరిగింది. రాజీ అనే పాత్రలో సమంత తన నట విశ్వరూపం చూపించడంతో ఈ అమ్మడికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డు దక్కింది. ఆమె ముంబై వెళ్లి అవార్డుల వేడుకలో కూడా పాల్గొంది. ప్రస్తుతం సామ్ కు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంత .. మనోజ్ బాజ్ పాయ్‌కు దీటుగా రాజీ పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఇంతకు ముందెప్పుడూ చూడని సరికొత్త సమంతను చూసి అభిమానులే కాదు, విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాడే రెబల్‌గా సమంత జీవించిందనే చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Family Man 2
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

