వాటిని చూస్తే భయం
అగ్ర కథానాయిక సమంత ప్రస్తుతం నటనకు కాస్త విరామమిచ్చి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నది. సోషల్‌మీడియాలో మాత్రం తరచుగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నది. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
అగ్ర కథానాయిక సమంత ప్రస్తుతం నటనకు కాస్త విరామమిచ్చి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నది. సోషల్‌మీడియాలో మాత్రం తరచుగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నది. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఫ్లవర్ బొకేను (పుష్పగుచ్ఛం) ముందుపెట్టుకొని చూస్తున్న ఓ ఫొటోను షేర్ చేసిన సమంత..దానిపై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ రాసింది. ‘నాకు పువ్వులంటే చాలా ఇష్టం. కానీ అలర్జీ కారణంగా వాటికి దూరంగా ఉండాల్సి వస్తున్నది.
అందుకే ఫ్లవర్ బొకేలను చూస్తే చాలు మనసులో రకరకాల భావాలు మెదలుతాయి. నా శరీరానికి ఈ ఫ్లవర్స్ పడవు. ఈ బొకేల వల్ల గతంలో ఓసారి ఎమర్జెన్సీ రూమ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఇవంటే భయం’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. గత ఏడాది ‘ఖుషి’ తర్వాత తెలుగులో మరే చిత్రాన్నీ అంగీకరించలేదు సమంత. హిందీలో మాత్రం ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

