Samantha | ‘మా ఇంటి బంగారం’ బ్లూపర్స్ రిలీజ్.. సమంత ఫన్నీ మూమెంట్స్ వైరల్
Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫీమేల్-లీడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచిన ఈ మూవీ విజయోత్సాహంలో చిత్ర నిర్మాణ సంస్థ ప్రేక్షకుల కోసం ప్రత్యేక సర్ప్రైజ్ అందించింది.
Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫీమేల్-లీడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచిన ఈ మూవీ విజయోత్సాహంలో చిత్ర నిర్మాణ సంస్థ ప్రేక్షకుల కోసం ప్రత్యేక సర్ప్రైజ్ అందించింది. సినిమా నుంచి డిలీటెడ్ సీన్స్‌తో పాటు షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న బ్లూపర్స్ వీడియోను విడుదల చేసింది. సినిమా కోసం చిత్రీకరించినప్పటికీ తుది వెర్షన్లో చోటు దక్కని కొన్ని సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. అలాగే షూటింగ్ సమయంలో నటీనటులు చేసిన చిన్న చిన్న పొరపాట్లు, సరదా సంఘటనలు, ఫన్నీ మూమెంట్స్‌ను కూడా ఇందులో పొందుపరిచారు.
“మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్, బ్లూపర్స్… థియేటర్లలో మరింత ఎంజాయ్ చేయండి” అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో తీవ్ర భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల్లో కనిపించిన సమంత.. షూటింగ్ సెట్స్‌లో మాత్రం ఎంతో సరదాగా గడిపినట్లు బ్లూపర్స్ వీడియోలో కనిపిస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి, నటులు గుల్షన్ దేవయ్య, శ్రీముఖితో కలిసి ఆమె చేసిన సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో జరిగిన చిన్నపాటి పొరపాట్లు, డైలాగులు మరిచిపోయి నవ్వేసిన సందర్భాలు, సెట్స్‌లో అందరితో కలిసిమెలిసి గడిపిన క్షణాలు వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
‘మా ఇంటి బంగారం’తో సమంత మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫీమేల్-లీడ్ తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. గతంలో అరుంధతి నెలకొల్పిన రికార్డును అధిగమిస్తూ ఈ సినిమా కొత్త మైలురాయిని అందుకుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో సమంత పోషించిన ‘స్వర్ణ’ పాత్రలోని విభిన్న భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, సమంత సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నందిని రెడ్డి క్రియేటివ్ డైరెక్షన్ అందించారు. అలాగే దిగంత్ మంచాలే, గుల్షన్ దేవయ్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

