Samantha | ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎక్కడ లేని పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ సమంత. ఎవరి అండ లేకపోయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చు అని కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. చాలా కాలం తర్వాత ‘యశోద’తో మంచి కంబ్యాక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం అదే జోష్‌తో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ఇక ఆమె నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఇటీవలే రిలీజైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సామ్ కొత్త అప్డేట్తో అభిమానులను ఖుషీ చేసింది.
ఇటీవలే సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి సామ్ వేగంగా కోలుకుంటుది. కాగా గత కొన్ని రోజులుగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సామ్.. తాజాగా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న ‘సిటాడెల్’ ఫ్రాంచైజీలో ఇది ఇండియన్ ఒరిజినల్ సిరీస్. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ ఇండియన్ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా సమంత ఈ వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేస్తూ తన లుక్‌ను అభిమానులతో పంచుకుంది. ఇందులో సామ్ మోడరన్ లుక్‌లో, స్టైలిష్ కాప్‌గా కనిపిస్తుంది. సమంత లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక సామ్ త్వరలోనే ఖుషీ షూటింగ్లో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మూడో షెడ్యూల్‌ను మొదలు పెట్టనుంది. దీనితో పాటుగా సామ్ మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.
🫶🏻@rajndk https://t.co/JwDGfjdQqS
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023