రియలిస్టిక్ సినిమాలు ఇష్టం

‘వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాల్ని నేను ఇష్టపడతాను. ఇది అలాంటి కథే. రియలిస్టిక్‌గా సాగుతూ అందరికీ కనెక్ట్ అవుతుంది. నాకు ఎంతో ఇష్టమైన హాస్యనటుడు అలీ నిర్మిస్తున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమాలోని మూడో పాటను శుక్రవారం సమంత విడుదలచేసింది. అలీ, నరేష్, పవిత్రాలోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. మోహన్ కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘మలయాళంలో విజయవంతమైన ‘వికృతి’ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. సామాజిక మాధ్యమాల ప్రభావం సామాన్యులపై ఎలా పడుతోంది? కొందరు ఆకతాయిలు సరదా కోసం చేసిన పనివల్ల ఓ అమాయక కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నదన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సందేశం అలరిస్తుంది. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

