Samantha | సమంత చేతికి గాయాలు.. ఆందోళనలో అభిమానులు
మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న 'సిటాడెల్' వెబ్‌సిరీస్ షూటింగ్లో పాల్గొంటుంది. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత పోలీస్ అధికారిగా కనిపించనుంది.
Samantha Injured | మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ షూటింగ్లో పాల్గొంటుంది. ఈ వెబ్‌సిరీస్‌లో సమంత పోలీస్ అధికారిగా కనిపించనుంది. ఇటీవలే రిలీజైన సామ్ లుక్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దీనితో పాటుగా విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ షూటింగ్‌కు కూడా ముస్తాబవుతుంది. మయోసైటిస్ వల్ల ఇన్నాళ్లు షూటింగ్‌లకు బ్రేక్ తీసుకున్న సమంత.. ఇప్పుడు కమిట్ అయిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సామ్ షూటింగ్లో గాయపడింది.
సమంత తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో ‘పర్క్స్ ఆఫ్ యాక్షన్’ అంటూ చేతికి గాయాలైనట్లు వెల్లడించింది. కాగా ‘సిటాడెల్’ షూటింగ్లో భాగంగా ఓ స్టంట్ సీన్ కోసం రిహార్సల్స్ చేస్తుండగా ఈ గాయాలైనట్లు తెలుస్తుంది. దీంతో సామ్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. సినిమా కోసం రక్తాలు వచ్చేంతలా కష్టపడటం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ‘యశోద’తో మంచి కంబ్యాక్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం అదే జోష్‌తో ‘శాకుంతలం’ సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత ఏప్రిల్14న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఓ మోస్తరు అంచనాలు క్రియేట్ చేశాయి.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

