సమంత గూఢచర్యం
‘ఫ్యామిలీ మెన్-2’ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. ఓ వైపు తెలుగులో భారీ చిత్రాల్లో భాగమవుతూనే..బాలీవుడ్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది.
‘ఫ్యామిలీ మెన్-2’ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. ఓ వైపు తెలుగులో భారీ చిత్రాల్లో భాగమవుతూనే..బాలీవుడ్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నది. అమెరికన్ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. వరుణ్‌ధావన్ ప్రధాన పాత్రలో యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందించనున్న ఈ సిరీస్‌కు ‘ఫ్యామిలీ మెన్-2’ మేకర్స్ రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో సమంత గూఢచారి పాత్రలో కనిపించనుందట. ఇందుకోసం ఆమె హిందీ భాషలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నది. తన పాత్ర తెరపై సహజంగా కనిపించాలంటే హిందీ ఉచ్ఛారణలో ఎలాంటి దోషాలు ఉండొద్దనే పట్టుదలతో సమంత ఉందని చెబుతున్నారు. భారీ యాక్షన్ హంగులున్న వెబ్సిరీస్కావడంతో అమెరికా వెళ్లి యాక్షన్ అంశాల్లో కూడా సమంత ట్రెయినింగ్ తీసుకుందని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

