Samajavaragamana | టాలీవుడ్ కామెడీ హిట్ ‘సామజవరగమన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల నటి రెబా మోనికా జాన్ తన అభిమానులకు తీపి కబురు అందించింది. తాను త్వరలోనే తల్లికాబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా తన భర్త జోమోన్ జోసెఫ్‌తో కలిసి దిగిన బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ జంట థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ ఐలాండ్‌లో వెకేషన్లో ఉన్నారు. అక్కడ సముద్ర తీరాన తన భర్తతో కలిసి దిగిన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ.. “మేము ఇద్దరి నుండి ముగ్గురం కాబోతున్నాం.. హల్లెలూయ” అంటూ ఎంతో భావోద్వేగంగా రాసుకొచ్చారు. భగవంతుడు ప్రసాదించిన ఈ అద్భుతమైన కానుకకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కొత్త ప్రయాణంలో అందరి ఆశీస్సులు కావాలని ఆమె కోరారు.
రెబా మోనికా జాన్ 2022 జనవరిలో తన చిరకాల మిత్రుడు జోమోన్ జోసెఫ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్‌గా ఉంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ, తెలుగులో ‘సామజవరగమన’, ‘మృత్యుంజయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెబా షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, సినీ సెలబ్రిటీలు మరియు అభిమానులు ఈ జంటకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.