ఏ మాయ చేశావే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత తన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. పెళ్లి తర్వాత సమంత కెరియర్ డల్ అవుతుందేమో అని అందరు అనుకున్నారు . కాని రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తుంది. తొలిసారి ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నెగెటివ్ షేడ్ పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో రాజీ అనే పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. యాక్షన్ సన్నివేశాలలో సమంత నటన ఎంతగానో ఆకట్టుకుంది. అయితే యాక్షన్ సన్నివేశాల కోసం సమంత ఎంతగా కష్టపడిందో వీడియో ద్వారా తెలియజేసింది. రిహారల్స్కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ.. వెబ్ సిరీస్‌లో యాక్షన్ సన్నివేశాలు ఇంత బాగా రావడానికి కారణం ట్రెయిన్ చేసిన స్టంట్ కో ఆర్డినేటర్ యానిక్ బెన్. అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ సమంత పేర్కొంది. భవనంపై నుండి దూకే సన్నివేశాలంటే తనకు చాలా భయమని చెప్పిన సమంత ..యానిక్ ఉన్నాడనే ధైర్యంతోనే ఆ స్టంట్స్ చేశానని పేర్కొంది. మొత్తానికి సమంత ది డేరింగ్ ఆఫ్ సౌత్ లేడిగా అందరి ప్రశంసలు అందుకుంటుంది.