Rajpal Yadav | అవార్డు ఫంక్షన్లో రాజ్‌పాల్ యాదవ్‌కు చేదు అనుభవం.. అండగా నిలిచిన సల్మాన్ ఖాన్
Salman Khan | బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు అండగా నిలిచాడు అగ్ర నటుడు సల్మాన్ ఖాన్. ఇటీవల ముంబైలో జరిగిన 'స్క్రీన్ అవార్డ్స్ 2026' వేడుకలో రాజ్‌పాల్ యాదవ్‌ను ఉద్దేశించి హోస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే.
Salman Khan | బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు అండగా నిలిచాడు అగ్ర నటుడు సల్మాన్ ఖాన్. ఇటీవల ముంబైలో జరిగిన ‘స్క్రీన్ అవార్డ్స్ 2026’ వేడుకలో రాజ్‌పాల్ యాదవ్‌ను ఉద్దేశించి హోస్ట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. గతంలో రాజ్‌పాల్ ఎదుర్కొన్న చెక్ బౌన్స్ కేసును హోస్ట్ ప్రస్తావిస్తూ.. ‘రాజ్‌పాల్ భాయ్, డాలర్ రేటు ఎంత పెరిగినా, తగ్గినా.. మీరు తీసుకున్న అప్పును మాత్రం అంతే మొత్తంలో తిరిగి చెల్లించాలి’ అని ఎద్దేవా చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలతో రాజ్‌పాల్ యాదవ్ కాస్త ఇబ్బంది పడ్డారు.
అయితే ఈ ఘటనపై స్పందించిన సల్మాన్ ఖాన్ రాజ్‌పాల్ యాదవ్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్‌పాల్ యాదవ్ ప్రతిభను కొనియాడుతూ సల్మాన్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ‘రాజ్‌పాల్ భాయ్, మీరు గత 30 ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఉన్నారు. మీ పనితనం ఏంటో మీకు తెలుసు, అందుకే మేమంతా మిమ్మల్ని మళ్లీ మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటాం. మీరు సినిమాకు ఒక ప్రత్యేక విలువను తీసుకొస్తారు. మీకు పని ఎప్పుడూ దొరుకుతుంది, ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారమే మీకు అవకాశాలు వస్తూనే ఉంటాయి.. ఇది నిజం’ అని సల్మాన్ ధైర్యాన్ని ఇచ్చారు.
అంతేకాకుండా, డాలర్ రేటు గురించి జరిగిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “ఒక్కోసారి మాటలు అలా వచ్చేస్తుంటాయి, కానీ అవన్నీ పట్టించుకోకుండా మనసు పెట్టి పని చేయండి. డాలర్ పెరిగినా, తగ్గినా మనకేం తేడా తెలుస్తుంది. మనం ఇచ్చేది ఇండియన్ కరెన్సీలోనే కదా” అంటూ చమత్కరిస్తూనే ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఒక సీనియర్ నటుడిని అందరి ముందు ఎగతాళి చేయడం సరికాదని నెటిజన్లు హోస్ట్‌పై మండిపడుతుండగా, సల్మాన్ ఖాన్ స్పందించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ఏప్రిల్ 5న ముంబైలో జరిగిన ఈ అవార్డు వేడుకలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
Another shocker from the event 🤯
Journalist #SaurabhDwivedi takes a dig at #RajpalYadav’s cheque bounce case..🤐
“Dollar-Rupee kitne bhi Upar-Niche ho… aapko utne hi Rupees lautane padenge jitne udhaar hain.”
How it is allowed 😳#BhoothBangla pic.twitter.com/MUwS4YcbXO
— Pan India Review (@PanIndiaReview) April 6, 2026
Rajpal bhai aap 30 yrs se kaam kar rahe ho aur hum sabne aapko repeat kiya hai baar baar kyunki aap apna kaam jante ho aur ek value laate ho , kaam toh aapko bohot milega aur issi dollar rate pe milega aur milte rahega . Hakikat yeh hai .
Aur yeh yaad rakhna ke kabhi kabhi flow… pic.twitter.com/CzE86CCYXH— Salman Khan (@BeingSalmanKhan) April 7, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

