Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Salman Khan Launches YouTube | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అధికారికంగా తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు.
Salman Khan Launches YouTube | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అధికారికంగా తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. ‘బీయింగ్ ది సల్మాన్ ఖాన్’ (Being The Salman Khan) పేరుతో లాంచ్ చేసిన ఈ ఛానెల్ ద్వారా అభిమానులకు తన నటన శైలి, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌కు సంబంధించిన ప్రత్యేకమైన కంటెంట్‌ను అందించబోతున్నాడు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ కొత్త ఛానెల్ లింక్‌ను షేర్ చేస్తూ ఆయన అభిమానులను ఆహ్వానించారు. ఈ ఛానెల్లో సల్మాన్ ఖాన్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఒకరిగా యాక్టింగ్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా, మరొకరిగా నటనను అభ్యసించే విద్యార్థిగా కనిపించడం విశేషం. “శురు సే శురు కర్తే హై.. నా అధికారిక యూట్యూబ్ ఛానెల్. ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఇక్కడే దొరుకుతాయి” అంటూ సల్మాన్ ఖాన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలియా భట్, ప్రియాంక చోప్రా, కార్తీక్ ఆర్యన్ వంటి పలువురు ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రిటీల బాటలోనే సల్మాన్ కూడా ఇప్పుడు యూట్యూబ్ వేదికగా అభిమానులకు మరింత చేరువవుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు అపూర్వ లఖియా దర్శకత్వంలో చిత్రంగా రూపొందుతున్న ‘మాతృభూమి’ చిత్రంలో చిత్రంగదా సింగ్‌తో కలిసి సల్మాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ త్వరలోనే వెల్లడికానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

