Salaar Movie | దిల్ రాజుకి షాక్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్.. సుదర్శన్‌లో హాయ్ నాన్న ఉంచడంపై ఫన్నీ పోస్ట్
Salaar | సలార్ (Salaar) మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘బాహుబలి’ ప్రాంఛైజీ తర్వాత ప్రభాస్ నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. దీంతో చాలా కాలంగా ప్రభాస్ అభిమానులు హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.
Salaar | సలార్ (Salaar) మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘బాహుబలి’ ప్రాంఛైజీ తర్వాత ప్రభాస్ నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. దీంతో చాలా కాలంగా ప్రభాస్ అభిమానులు హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండాపోయాయి. ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్దకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. సినిమా థియేటర్స్ వద్ద టపాసులు పేల్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇదిలావుంటే.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్, సంధ్య, దేవి థియేటర్లు ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ప్రతి మూవీ లవర్ కోరుకుంటాడు. అయితే ఈరోజు ‘సలార్’ సినిమా రాకతో చాలా చోట్ల ప్రస్తుతం నడుస్తున్న ‘హాయ్ నాన్న’ను తీసేసి ఆ థియేటర్లు ప్రభాస్ సినిమాకు ఇచ్చారు. కానీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌ను మాత్రం ఇవ్వలేదు. ఈ థియేటర్లో ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమానే ప్రదర్శిస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుపై మండిపడ్డారు. అయిన కూడా దిల్ రాజ్ తగ్గకుండా ‘హాయ్ నాన్న’ నడిపిస్తున్నాడు.
అయితే ‘సలార్’ సినిమా చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లిన ఓ నెటిజన్ దిల్ రాజును ట్యాగ్ చేస్తూ ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు. సుదర్శన్ థియేటర్లో హాయ్ నాన్న కంటిన్యూ చేసినందుకు థాంక్యూ సార్ దిల్ రాజు గారు. బైక్ పార్కింగ్ అక్కడ చేసి సంధ్యలో సలార్ సినిమాకు వెళ్లాం. ఆ క్రౌడ్‌లో పార్కింగ్ అంటే ఇంటర్వల్‌కి వెళ్లాలి’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Sudarshan lo #hinanna continue chesinandhuku Thanks sir @DilRajuOff_ bike parking akkada chesi sandhya ki vellam.. ah crowd lo parking ante interval ke vellali
— tweetakudu (@tweetakudu) December 22, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

