Salaar Movie Collections | పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.178 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజుల్లో ఏకంగా రూ.295 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా సెకండ్ డే కలెక్షన్లను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
సలార్ ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు రూ.116 కోట్ల వసూళ్లు రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ రికార్డు రూ.140 కోట్ల గ్రాస్‌తో విజయ్ నటించిన ‘లియోతో పాటు ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాలపై ఉంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
𝑻𝒉𝒆 𝑯𝒖𝒏𝒕𝒊𝒏𝒈 𝑺𝒆𝒂𝒔𝒐𝒏 𝑩𝒆𝒈𝒊𝒏𝒔…🔥💥#SalaarCeaseFire dominates the global-box office, crossing 𝟐𝟗𝟓.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟐 𝐃𝐚𝐲𝐬!#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/suEQftytyj
— Salaar (@SalaarTheSaga) December 24, 2023