Salaar Movie Collections | ‘సలార్’ సునామీ.. మూడు రోజుల్లో రూ.402 కోట్లు
Salaar Movie Collections | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా.. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Salaar Movie Collections | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.178 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజుల్లో ఏకంగా రూ.295 కోట్లు వసూలు చేసింది. అయితే మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ఆదివారం కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ఇక ‘సలార్’ ఆదివారం కలెక్షన్స్ చూస్తే.. వరల్డ్‌వైడ్‌గా రూ.107 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.402 కోట్ల వసూళ్లు రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. రానున్న రెండు రోజులు కూడా క్రిస్మస్, బాక్సింగ్ డే అవ్వడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.
𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑲𝑨 𝑺𝑨𝑳𝑨𝑨𝑹 🔥#BlockbusterSalaar hits 𝟒𝟎𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬!#RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C8rFGeSs86
— Salaar (@SalaarTheSaga) December 25, 2023
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది ఖాన్సార్ అరాచక సామ్రాజ్యం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతుంటుంది. ప్రత్యేక రాజ్యాంగం తయారు చేసుకొని, రాజ్యానికి నాలుగు వైపుల బలమైన గోడలు నిర్మించి అక్కడి రాజు రాజమన్నార్ (జగపతిబాబు) సామ్రాజ్య పాలన చేస్తుంటాడు. రాజ మన్నార్ తన కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరగా చేయాలని నిరయిస్తాడు. రాజ్యానికి సంబంధించిన ఓ ముఖ్యమైన పనిపై కొన్నాళ్లు బయటికివెళ్తాడు రాజ మన్నార్. ఈలోగా సింహాసనం కోసం అంతర్యుద్దం మొదలౌతుంది. మిగతా దొరలంతా కలసి వరదని అంతం చేయడానికి సైన్యాలని రప్పించుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు. అసలు ఈ దేవ ఎవరు ? వరద, దేవాల మధ్య వున్న అనుబంధం ఏమిటి ? అంత సైన్యాన్ని దేవా ఒక్కడే ఎలా ఎదురుకున్నాడు? ఈ కథలో ఆద్య (శ్రుతిహాసన్) పాత్ర ఏమిటి ? సింహాసనం కోసం జరిగిన ఈ యుద్ధంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ? అనేది తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

