Sakshi Vaidya | ప్రయోగాలకు సిద్ధం
‘ప్రేమకథా చిత్రాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌లో నటించాలనుంది. ప్రతీ సినిమాలో నటనాపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది సాక్షి వైద్య. ‘ఏజెంట్' చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది.
‘ప్రేమకథా చిత్రాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌లో నటించాలనుంది. ప్రతీ సినిమాలో నటనాపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలన్నదే నా లక్ష్యం’ అని చెప్పింది సాక్షి వైద్య. ‘ఏజెంట్’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసిన ఈ భామ ప్రస్తుతం చక్కటి అవకాశాలతో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఆమె ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన నటిస్తున్నది. ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం సాక్షి వైద్య పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ సినిమాలో నేను ఐరా అనే స్వంతంత్య్ర భావాలు కలిగిన అమ్మాయిగా కనిపిస్తాను.
కథాగమనంలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. లండన్‌లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఎక్కడా గ్యాప్ లేకుండా శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయడంతో కొద్ది రోజుల పాటు నా పాత్ర ప్రభావం నుంచి బయటకు రాలేకపోయా. వ్యక్తిగతంగా నేను అన్ని జోనర్ చిత్రాలను ఇష్టపడతా. ‘యశోద’ చిత్రంలో సమంత లాంటి పాత్ర చేయాలన్నది నా డ్రీమ్. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. నటిగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. తెలుగు భాషను నేర్చుకొని అభిమానులకు ప్రేమను తిరిగి ఇస్తాను. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ చిత్రంలో నటిస్తున్నా. సాయిధరమ్‌తేజ్‌తో ఓ సినిమా అంగీకరించా. రవితేజతో ఓ సినిమా చర్చల్లో ఉంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

