Gargi Movie | సాయిపల్లవి ‘గార్గి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?
Gargi Movie First Single | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి సాయి పల్లవి. గ్లామర్‌కు అతీతంగా నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈమెకు టైర్2 హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఇటీవలే ‘విరాటపర్వం’తో మరోసారి తన నటనతో ప్రేక్షకులను మాయ చేసింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సాయిపల్లవి నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘గార్గి’ విడుదలకు సిద్ధంగా ఉంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
‘యాత్రి’ అంటూ సాగే పస్ట్ సింగిల్‌ను మంగళవారం రాత్రి 7గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ’96’ ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు. తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతికలు ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నాడు. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రం జూలై 15న తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
From the intense #Gargi, First single #Yaathri / #Yaatri / #Yathiri out today at 7PM! 🥁💥@Sai_Pallavi92 @Suriya_offl #Jyotika @rajsekarpandian @prgautham83 @kaaliactor @blacky_genie @2D_ENTPVTLTD @SakthiFilmFctry pic.twitter.com/wVK3qRlN7h
— Sony Music South India (@SonyMusicSouth) July 12, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

