Sai Pallavi | ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సాయి పల్లవి అరుదైన రికార్డు.. ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్
Sai Pallavi | మలయాళం నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మలర్ అనే పాత్రతో కుర్రకారు హృదయాలను దోచుకుంది.
Sai Pallavi | మలయాళం నుంచి ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మలర్ అనే పాత్రతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో మంచి మార్కులు సంపాదించడమే కాకుండా స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత లవ్ స్టోరీ, గార్గీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించింది. అయితే ఈ భామ తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్‌లో అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పటివరకు ఎవరు అందుకోని విధంగా ఏకంగా ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుని రికార్డు సృష్టించింది.
Filmfare Awards | సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) జాబితా విడుదలైన విషయం తెలిసిందే. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ( 68th edition of Film fare Awards South) జాబితాను గురువారం నిర్వాహకులు ప్రకటించగా.. ఇందులో సాయి పల్లవి సత్తా చాటింది. ‘గార్గి’ చిత్రానికి తమిళంలో ఉత్తమ నటిగా అలాగే ‘విరాటపర్వం’ సినిమాకు తెలుగులో క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా రెండు భాషల్లో అవార్డులు దక్కించుకోని రికార్డు సృష్టించింది. దీంతో సౌత్ ఇండియాలో అతి తక్కువ కాలంలో ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డు దక్కించుకున్న కథానాయికగా సాయి పల్లవి రికార్డు సాధించింది.
ఇక సాయి పల్లవి అవార్డులు అందుకున్న సినిమాలు చూసుకుంటే..
ప్రేమమ్ సినిమా – ఉత్తమ నటి (డెబ్యూ) –
ఫిదా – ఉత్తమ నటి
లవ్ స్టోరీ – ఉత్తమ నటి
శ్యాం సింగరాయ్ – ఉత్తమ నటి (క్రిటిక్స్)
గార్గి – ఉత్తమ నటి
విరాటపర్వం – ఉత్తమ నటి (క్రిటిక్స్)
Also Read..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Fida
- Film fare awards
- Gargi
- Premam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

