venkatesh | మనసుల్ని కట్టిపడేసే ‘సైంధవ్’
వెంకటేశ్‌కి బాగా కలిసొచ్చిన సీజన్ సంక్రాంతి. ప్రేమ, చంటి, ధర్మచక్రం, కలిసుందాంరా.. ఇవన్నీ సంక్రాంతి రిలీజ్లే. ఈ లిస్ట్‌లో ‘సైంధవ్' కూడా చేరనున్నది. జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.
వెంకటేశ్‌కి బాగా కలిసొచ్చిన సీజన్ సంక్రాంతి. ప్రేమ, చంటి, ధర్మచక్రం, కలిసుందాంరా.. ఇవన్నీ సంక్రాంతి రిలీజ్లే. ఈ లిస్ట్‌లో ‘సైంధవ్’ కూడా చేరనున్నది. జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. చాలాకాలం తర్వాత ఉద్వేగపూరితమైన పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారని తెలిసింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తుండటం, ‘హిట్ సిరీస్’ ఫేం శైలేష్ కొలను దర్శకుడు కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ‘సైంధవ్’ హీరోగా వెంకటేశ్‌కి 75వ సినిమా కావడం మరో విశేషం.
ఈ సినిమా వైవిధ్యమైన కథ, కథనాలతో సాగుతుందని, ప్రత్యేకతల సమాహారంగా ఉంటుందని, బేబీ సారా, వెంకటేశ్ మధ్య సాగే సన్నివేశాలు మనసుల్ని కట్టిపడేస్తాయని మేకర్స్ చెబుతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఆర్య, శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, నిర్మాత: వెంకట్ బోయనపల్లి, నిర్మాణం: నిహారిక ఎంటర్టైన్మెంట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

