Saindhav Movie | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటించిన తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయం అందుకుంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావడం.. అలాగే థియేటర్లు తక్కువ కేటాయించడంతో మూవీకి ఆశించిన కలెక్షన్స్ దక్కలేదు. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చారు. ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ కథనాయికగా నటించింది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు.
#SainDhav Now Streaming on Amazon Prime#SaindhavOnPrime pic.twitter.com/J4R9hE5xnD
— BigBoss Telugu Views (@BBTeluguViews) February 2, 2024
సైంధవ్ (వెంకటేష్) చంద్రప్రస్థ అనే పోర్ట్లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. కూతురు గాయత్రి (బేబీ సారా) అంటే పంచప్రాణాలు. భర్తకు దూరంగా ఉంటున్న మరో మనో (శ్రద్ధా శ్రీనాథ్) అనే మహిళతో సైంధవ్ సాన్నిహిత్యం పెంచుకుంటాడు. చిన్నారి గాయత్రి అనుకోకుండా స్పైనల్ మస్క్యులర్ అట్రోపి అనే ఆరుదైన వ్యాధి బారిన పడుతుంది. దానిని నయం చేయడానికి 17కోట్ల ఖరీదైన ఇంజక్షన్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో సైంధవ్ అలియాస్ సైకో ఏం చేశాడు? పిల్లల అక్రమ రవాణా చేస్తున్న వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధీఖీ)తో సైంధవ్ ఎలాంటి పోరాటం చేశాడు? చివరకు తన కూతురిని రక్షించుకోగలిగాడా? లేదా? అన్నదే ఈ సినిమా కథ.