Saindhav Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న వెంకటేష్ ‘సైంధవ్’.. రన్ టైం ఎంతంటే.?
Saindhav Movie | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం.
Saindhav Movie | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ అందించారు. 2 గంటల 15 నిమిషాల రన్టైమ్తో ఈ సినిమా వస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం సామజిక వేదికల్లో ప్రకటించింది. ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ కథనాయికగా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

