Saindhav Movie | వెంకటేశ్ సైంధవ్ నుంచి ‘బుజ్జికొండవే’ సాంగ్ రిలీజ్
Saindhav Movie | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం.
Saindhav Movie | టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇదిలావుంటే.. తాజాగా మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ ‘బుజ్జికొండవే’ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట చూస్తే.. వెంకీ, కూతురు మధ్య ఎమోషనల్‌గా ఈ పాట ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాటను S. P చరణ్ పాడగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చాడు.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ కథనాయికగా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

