నువ్వు నా వరమే..
అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్'. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్ 75వ చిత్రంగా ‘సైంధవ్’ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ‘బుజ్జి కొండవే’ అనే ఎమోషనల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేశారు. కూతురు అనారోగ్యం వల్ల తండ్రి కలత చెందడం, తన గుండెల్లోని బాధను దిగమింగుతూ చిన్నారికి సాంత్వన చేకూర్చే ప్రయత్నంలో ఈ పాట సాగింది.
‘బంగారమే నువ్వు నా వరమే..నీ సంతోషమే నన్ను నడిపించే బలమే..’ అంటూ పాట భావోద్వేగభరితంగా సాగింది. సంతోష్ నారాయణన్ స్వరాల్ని సమకూర్చగా, ఎస్పీ చరణ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి గీత రచన చేశారు. ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయబోతున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణన్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

