హృదయానికి దగ్గరైన సినిమా
‘గని’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది ముంబయి భామ సయీ మంజ్రేకర్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మేజర్'. అడివి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ “నా హృదయానికి ఎంతగానో దగ్గరైన చిత్రమిది.
‘గని’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది ముంబయి భామ సయీ మంజ్రేకర్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ “నా హృదయానికి ఎంతగానో దగ్గరైన చిత్రమిది. ఇందులో నేను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాఠశాల మిత్రురాలు, ఆయన భార్య ఇషా పాత్రలో కనిపిస్తాను. సందీప్‌ఉన్నికృష్ణన్ జీవితాన్ని ప్రభావితం చేసే మహిళగా నా పాత్ర భిన్నకోణాల్లో సాగుతుంది. ఈ సినిమాకు స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాను.
తెలుగు స్పష్టంగా పలకడానికి ఎంతో సాధన చేశాను. సినిమా చూస్తున్నప్పుడు చాలా సహజంగా డబ్బింగ్ చెప్పాననిపించింది. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. కొద్ది రోజుల క్రితం సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్‌ను కలిశాను. వారు నా పట్ల ఎంతో ఆప్యాయత కనబరిచారు. కెరీర్ తొలినాళ్లలోనే తెలుగులో పెద్ద సంస్థల నుంచి అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఓ నటిగా ఇంతకుమించి ఏమీ కోరుకోవడం లేదు. మనసుకు నచ్చిన కథల్లో నటిస్తూ నాయికగా రాణించాలనుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

