Ranga Ranga Vaibhavanga | ‘రంగరంగ వైభవంగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్లుగా మెగా హీరోలు
Ranga Ranga Vaibhavanga Pre-Release | మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చిన తన నటన, అభినయంతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన కొండపొలం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. విడుదలైన వారంలోపే ఈ చిత్రం థియేటర్లలో నుండి వెళ్ళిపోయింది. ఇక ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు.
ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో సాయంత్ర 5 గంటలకు జరుగనుంది. ఈ క్రమంలో చిత్ర బృందం గెస్ట్‌లను ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్లుగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెగా యువ హీరోలు ఒకే వేదికపైకి రానుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేతికశర్మ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Supreme Hero @IamSaiDharamTej and Mega Prince @IAmVarunTej for #PanjaVaisshnavTej✨#RangaRangaVaibhavanga Pre Release Event Today @ 5pm!
🎟️https://t.co/upqfSM2ESo@TheKetikaSharma @GIREESAAYA @ThisIsDSP @SVCCofficial #BVSNPrasad @SonyMusicSouth @shreyasgroup pic.twitter.com/Ciai2nCCzk
— Shreyas Media (@shreyasgroup) August 30, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

