Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Kalki2 | పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సిక్వెల్ చిత్రం ‘కల్కి 2’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
Sai Pallavi | పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సిక్వెల్ చిత్రం ‘కల్కి 2’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ ఇతర సినిమాల కమిట్మెంట్ల కారణంగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కొద్దిగా నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్ర కోసం ప్రముఖ నటి సాయి పల్లవి ఎంపికైన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆమె ఈ అక్టోబర్ నెలలోనే సినిమా షూటింగ్ సెట్స్‌లో జాయిన్ కావాల్సి ఉండగా, మేకర్స్ ప్లాన్‌లో స్వల్ప మార్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి తాను నటిస్తున్న ‘రామాయణం’ సినిమా ప్రమోషన్లు మరియు ఇతర కార్యక్రమాలపై పూర్తి దృష్టి పెట్టారు. ఈ పవిత్ర పౌరాణిక చిత్రం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఆ సినిమా రిలీజ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆమె ‘కల్కి 2’ షూటింగ్ షెడ్యూల్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక క్లారిటీ రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

