Saipallavi | టాలీవుడ్లో సాయి పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా?
Saipallavi Best Friends In Tollywood | సాయి పల్లవి.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో బాగా పాపులర్ అవుతున్న నటి. ప్రస్తుతం ఈమెకు స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినీరంగం అంటేనే గ్లామర్. అందులో ముఖ్యంగా హీరోయిన్లు ఎంత గ్లామర్‌గా కనిపిస్తే అంతగా అవకాశాలు వస్తుంటాయి. అయితే సాయి పల్లవి మాత్రం గ్లామర్‌కు అతీతంగా, నటన ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ వస్తుంది. దీనివల్లే ఈమెకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆడియోఫంక్షన్లకు, సినిమా ప్రమోషన్లకు పద్దతిగా రావడం, తెలుగులో మాట్లాడటం వంటివి ఈమెను టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఇటీవలే ఈమె నటించిన ‘విరాటపర్వం’ మంచి విజయం సాధించింది.
ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారట. రానా, నాగచైతన్య ఇద్దరు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. తన ఫ్యామిలీలాగా తనపై కేర్ తీసుకుంటారని తెలిపింది. కాగా ఈ ఇద్దరి సినిమాల్లో సాయి పల్లవి నటించింది. ప్రస్తుతం సాయి పల్లవి ‘గార్గి’ చిత్రంలో నటిస్తుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. మహిళా ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

