Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
Sai Pallavi | బాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందు నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో రావణుడి గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీశాయి.
Sai Pallavi | బాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందు నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో రావణుడి గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు. మనలోని రావణుడిని కూడా గుర్తించి మార్చుకోవాలి అంటూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘రామాయణ’ వంటి ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, సాయి పల్లవికి మద్దతుగా నిలుస్తున్న అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె కామెంట్స్‌ని పూర్తిగా వినకుండా, ఒక చిన్న వీడియో క్లిప్ ఆధారంగా విమర్శించడం సరికాదని అంటున్నారు. సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్ పాత్రను ఉద్దేశించి ఆమె మాట్లాడి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం మనిషిలోని చెడు లక్షణాలను గుర్తించి వాటిని మార్చుకోవాలనే సాధారణ భావనతో ఆమె ఈ కామెంట్స్ చేసి ఉండవచ్చని చెబుతున్నారు. పూర్తి ఇంటర్వ్యూ చూడకుండా ఆమె కామెంట్స్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని అంచనా వేయడం సరికాదని అభిమానులు పేర్కొంటున్నారు. దీంతో సాయి పల్లవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
ఇప్పటికే ‘రామాయణ’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి వ్యాఖ్యలు చర్చకు దారితీయడం సినిమాపై మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రామాయణ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది. ఇక రావణుడిగా యష్ కనిపించనున్నాడు. మరి కొద్ది రోజులలో మూవీ వీడుదలకి సిద్ధమవుతున్న క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | ‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయి పల్లవి వ్యాఖ్యలపై నెట్టింట దుమారం!
AP news | అర్నబ్ తుపానుతో అతలాకుతలం.. ఏపీలో నేడూ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

