ఆ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్‌నిచ్చిన అగ్ర కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఈ భామ జపాన్‌లో తన తొలి హిందీ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నది. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్‌ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్‌తో కలిసి సాయిపల్లవి ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జపాన్‌లోని సపోరోలో షూటింగ్ జరుగుతున్నది. అక్కడ జరిగే సంప్రదాయ మంచు పండగ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా సెట్లోని కొన్ని స్టిల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. సపోరోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. సునీల్‌పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాతో పాటు నితీష్ తివారి తెరకెక్కించబోతున్న ‘రామాయణ’ చిత్రంలో సాయిపల్లవి.. సీత పాత్రలో నటించబోతున్నది. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘తండేల్’లో నటిస్తున్నది సాయిపల్లవి.