కుటుంబ విలువలు తెలిపే సినిమా
రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సః కుటుంబానాం’. డా.రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేశ్, భద్రం తదితరులు కీలక పాత్రధారులు. ఉదయ్‌శర్మ దర్శకుడు. మహదేవ్గౌడ్, నాగరత్న నిర్మాతలు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది.
రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సః కుటుంబానాం’. డా.రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేశ్, భద్రం తదితరులు కీలక పాత్రధారులు. ఉదయ్‌శర్మ దర్శకుడు. మహదేవ్గౌడ్, నాగరత్న నిర్మాతలు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా ట్రైలర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇలాంటి కథ తన 48ఏండ్ల సినీ కెరీర్లోనే వినలేదని, ఇందులో తాను పోషించిన పాత్రలో చాలా ఛాలెంజ్‌లు ఉన్నాయని, కుటుంబ ప్రాధాన్యతను తెలియజెప్పే సినిమా ఇదని డా.రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఇందులో చిత్రమైన పాత్రను చేశానని, హీరోహీరోయిన్ల కాంబినేషన్ సీన్లలో నటించడం ముచ్చటేసిందని బ్రహ్మానందం చెప్పారు. దిగ్గజాలు పనిచేసిన సినిమా ఇదని దర్శకుడు ఉదయ్‌శర్మ పేర్కొన్నారు. తనను దర్శకుడిగా నిలబెట్టిన నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా నిర్మాత మహాదేవ్గౌడ్, హీరో రామ్‌కిరణ్ కూడా మాట్లాడారు. అగ్రసంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తున్న ఈ సినిమాకు కెమెరా: మధు దాసరి, నిర్మాణం: హెచ్.ఎన్.జి. సినిమాస్, ఎల్ఎల్పి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

