సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం అన్నాత్తె. దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.దీపావళి కానుకగా నవంబర్ 4న చిత్రాన్నివిడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. రీసెంట్గా చిత్రం నుండి బాలు పాడిన పాట విడుదల చేశారు.ఇది శ్రోతలని ఎంతగానో అలరించింది.
ఇక ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. రజనీకాంత్,నయనతార మధ్య వచ్చే సాంగ్‌ని రేపు సాయంత్రం 6 గంటలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.పోస్టర్ చూస్తే మాత్రం సరికొత్తగా ఉంది. పాట కూడా అందరిని అలరించేలా ఉంటుందిని అన్నారు.ఈ పాటని స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ అలాగే శ్రేయా గోషల్ లు ఆలపించారు . ఈ సినిమాకి డి ఇమాన్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.