Ram Charan : శంకర్-రామ్‌చరణ్ ప్రాజెక్ట్‌లో నటించనున్న.. స్టార్ డైరెక్టర్?
Ramcharan-shankar movie | మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ప్రస్తుతం సినిమాల జోరు పెంచుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించినట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Ramcharan-shankar movie | మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ప్రస్తుతం సినిమాల జోరు పెంచుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలకానుంది. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న #RC16 షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్‌ను జరుపుకుంటోంది. టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కీలక పాత్రకోసం ఓ స్టార్ డైరెక్టర్‌ను ఎంపిక చేసినట్లు టాక్.
ఇందులో కీలకపాత్రలో నటించడానికి ప్రముఖ నటుడు, దర్శకుడు S.J సూర్యను ఎంపిక చేశారట. శంకర్ చెప్పిన పాత్ర నచ్చడంతో ఈయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే S.J సూర్య తెలుగులో మహేష్‌బాబుతో కలిసి స్పైడర్ సినిమాలో నటించాడు. విజయ్‌తో అదిరింది మూవీతో పాటుగా తాజాగా వచ్చిన మానాడు చిత్రంలో కూడా నటించాడు. స్టార్ దర్శకుడిగానే కాదు విలక్షణ నటుడిగా కూడా ఈయన మంచి పేరు సంపాదించుకున్నాడు. శంకర్ తెరక్కెక్కిస్తున్న #RC16 చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ కార్తిక్ సుబ్బరాజు అందించాడు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

