కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నంకృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న విడుదల చేయబోతున్నారు. మంగళవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘మనోరంజన్ అనే యువకుడి కథ ఇది. కాలేజీలో తన రూల్స్ మాత్రమే ఫాలో కావాలనుకునే పంతం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? ఈ క్రమంలో ఎలాంటి వినోదం పండిందన్నదే చిత్ర కథాంశం.
ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది. సంపూర్ణ హాస్యరసభరిత చిత్రంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమ్రిష్ గణేష్, నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి, రచన-దర్శకత్వం: రత్నం కృష్ణ.