Rules Ranjan Movie Trailer | కిరణ్ అబ్బవరం సినిమాలను జనాలు కొంచెం కొంచెంగా మర్చిపోతున్న టైమ్‌లో వినరో భాగ్యము విష్ణు కథా సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా మరీ బంపర్ హిట్టయిందనలేం కానీ.. కిరణ్ గత సినిమాలతో పోల్చితే ఇది కాస్త బెటర్‌గానే ఉంటుంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు యూనానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ మీటర్ అంటూ మాస్ సినిమా చేసి ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయ్యాడు. దాంతో వినరో భాగ్యము సినిమాకు వచ్చిన కాస్తో కూస్తో క్రేజ్ కూడా ఈ మీటర్ సినిమాతో తుస్సుమంది. అదనంగా కిరణ్ మీమ్స్ మెటీరియల్ అయిపోయాడు. అలాంటి టైమ్‌లో రూల్స్ రంజన్ అనే సినిమాను ప్రకటించాడు.
ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు పెద్దగా అంచనాల్లేవు కానీ.. సమ్మోహనుడా పాటతో ఒక్కసారిగా రూల్స్ రంజన్ పేరు ప్రేక్షకుల నోళ్లలో నానింది. మత్తు మాదిరి పాట కొంచెం కొంచెంగా ఎక్కడంతో సినిమా రీచ్ మాములుగా పెరగలేదు. దానికి తోడు సలార్ పోస్ట్ పోన్ అవడంతో అదే డేట్‌ను కన్ఫర్మ్ చేసుకుని ఒక్క సారిగా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ట్రోల్స్ గట్రా పక్కన పెట్టేస్తే ఈ సినిమా ఒకటుందని జనాలకు తెలిసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌తో సినిమా స్టోరీపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడు రూల్స్ అంటూ ఒక గిరి గీసుకుని ఉంటాడు. అయితే గతం నుంచే పరిచయం ఉన్న ఓ అమ్మాయి మళ్లీ కలవడంతో తన రూల్స్‌ను సైతం బ్రేక్ చేసుకుంటాడు. పని తప్ప వేరే ధ్యాస లేని ఇన్నోసెంట్ కుర్రాడు కాస్త పబ్‌లు గట్రా తిరిగేస్తుంటాయి. అదే టైమ్‌లో ఆ అమ్మాయిపై తనుకు నిజంగానే ప్రేమ ఉందా? లేదా అలా అనిపిస్తుందా అనే కన్ఫ్యూజన్లో పడిపోతుంటాడు. చివరికి ఏమైంది అనేది తెలియాలంటే సెప్టెంబర్ 28వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు రత్నం కృష్ణ సినిమాను హిలేరియస్ వేలో తెరకెక్కించాడు. వన్ లైనర్ డైలాగ్స్ అయితే వేరే లెవల్లో ఉన్నాయి. ఈ పంచులు థియేటర్లో పక్కాగా పేల్తాయి. కిరణ్ కూడా సినిమాలో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. కామెడీ టైమింగ్ కూడా చక్కగా కుదిరింది.
ట్రైలర్ మట్టుకు ఆడియెన్స్‌ను థియేటర్ వైపు కదిలేలా చేసే విధంగానే ఉంది. ఇక కంటెంట్‌లోనూ కాస్త కొత్తదనం ఉంటే కిరణ్ ఫేయిల్సూర్స్కు ఈ సినిమా అడ్డు కట్ట వేసినట్లే. టాలీవుడ్ సెన్సేషన్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఏం రత్న నిర్మిస్తున్నాడు. అన్నట్లు ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఏం.రత్నం కొడుకే. గతంలో ఆయన నీ మనసు నాకు తెలుసు, ఆక్సీజన్ వంటి సినిమాలు చేశాడు.