Rukmini Vasanth | ఎటెళ్లాలో అర్థంకాక.. బోనులో చిక్కుకున్న ఎలుకలా రుక్మిణి వసంత్?
కథానాయిక రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి శాండిల్‌వుడ్‌లో బాగా హల్చల్ చేస్తున్నది. వివరాల్లో కెళ్తే.. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లో సంతకం చేసింది. తమ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదని ఒప్పందం సారాంశం.
Rukmini Vasanth | కథానాయిక రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి శాండిల్‌వుడ్‌లో బాగా హల్చల్ చేస్తున్నది. వివరాల్లో కెళ్తే.. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఎన్టీఆర్-ప్రశాంత్‌నీల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్లో సంతకం చేసింది. తమ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదని ఒప్పందం సారాంశం. ఇదిలావుంటే.. దీనికంటే ముందే ‘కాంతార-2’కు కూడా సైన్ చేసింది. ఈ సినిమా అయ్యేంతవరకూ మరో సినిమా చేయకూడదని రిషబ్‌శెట్టి ఒప్పందం.
దానిక్కూడా ఓకే అనేసి, అడ్వాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలకే కాక, చిన్నాచితకా సినిమాలక్కూడా ఓకే చెప్పిందట. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే షూటింగ్స్ జరుపుకోనున్నాయి. దాంతో తీసుకున్న డబ్బుల్ని వెనక్కి ఇవ్వలేక, ఎటెళ్లాలో అర్థం కాక, బోనులో చిక్కుకున్న ఎలుకలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నదట ఈ అందాల భామ. ఓ ప్లానింగ్ లేకుండా అగ్రిమెంట్లపై సంతకాలు చేసినందుకు అటు ప్రశాంత్‌నీల్, ఇటు రిషబ్‌శెట్టి ఈ ముద్దుగుమ్మపై కోపంగా ఉన్నారట. మరి ఈ సమస్యల నుంచి రుక్మిణి ఎలా బయటపడుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ వార్త కర్ణాటక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

