Ruhani Sharma | విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు : రుహానీ శర్మ
Ruhani Sharma | ‘చి॥ల॥సౌ’ (Chi La Sow), ‘హిట్ ’ (Hit) చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది టాలీవుడ్ నటి రుహానీ శర్మ (Ruhani Sharma). ఈ భామ ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడిగా వస్తున్న ‘సైంధవ్’ (Saindhav) చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి (Venkat Boyanapalli) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) కథానాయిక.
Ruhani Sharma | ‘చి॥ల॥సౌ’ (Chi La Sow), ‘హిట్ ’ (Hit) చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది టాలీవుడ్ నటి రుహానీ శర్మ (Ruhani Sharma). ఈ భామ ప్రస్తుతం వెంకటేష్ కథానాయకుడిగా వస్తున్న ‘సైంధవ్’ (Saindhav) చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి (Venkat Boyanapalli) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన రుహానీ శర్మ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెంకటేశ్ అంటే తనకు చాలా అభిమానం అని తన కామెడీ టైమింగ్ బాగుటుందని తెలిపింది. ఇక సైంధవ్ మూవీలో నేను డాక్టర్ రేణు పాత్రలో కనిపించబోతున్నాను. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను కానీ కల నెరవేరలేదు. కానీ సైంధవ్‌తో ఆ కల తీరబోతుంది. అని తెలిపింది. అయితే యాంకర్ అడుగుతూ.. మీకు అనుష్క శర్మ సిస్టర్ అవుతుందని అడుగగా.. రుహానీ స్పందిస్తూ.. అవును అనుష్కా నాకు అక్క అవుతుంది. విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు. వారిద్దరు చాలా మంచిగా, నాతో నార్మల్‌గా ఉంటారు. అందుకే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అంటూ రుహానీ వెల్లడించింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతున్న జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

