ఇంగ్లిష్ ఇరగదీశాడు..!
‘ఆర్ఆర్ఆర్' సినిమాలోని ‘నాటు నాటు..’ పాట ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడమూ తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించింది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడమూ తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించింది. ఇక ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్‌గా క్రిటిక్స్ చాయిస్ అవార్డును అంతర్జాతీయ వేదిక మీద అందుకున్నాడు రాజమౌళి. ఈ శుభ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం గత పదిపదిహేను రోజులుగా హాలీవుడ్లో హల్చల్ చేస్తున్నది. దీంతో, అక్కడి మీడియా మన హీరోల చుట్టూ తిరుగుతున్నది. వాళ్ల ముందు మైకులు పెట్టి ‘ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది?’ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నది. అమెరికన్ మీడియా ప్రతినిధులు అక్కడి మాండలికంలో వేస్తున్న వివిధ ప్రశ్నలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇస్తుండటంతో ఆయన అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.
సినిమా చిత్రీకరణ, దాని కోసం చిత్రబృందం పడిన కష్టం, ప్రపంచ స్థాయి గుర్తింపు పట్ల స్పందన… ఇలా విభిన్న అంశాల మీద ప్రశ్నల జల్లులు కురిపిస్తున్నారు విలేకరులు. వీటన్నిటికీ ఎన్టీఆర్ చక్కని పరిణతితో, మంచి ఉచ్చారణతో ఏ మాత్రం తడబడకుండా ఆంగ్లంలో సమాధానాలు చెప్పాడు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిమీద ట్రోల్ చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే, ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘మనందరం ఒకే భూమి మీద నివసించే మనుషులం. కేవలం మన మధ్య కాలమానాలూ, కాస్త యాసలే తేడా. తూర్పు దేశమైనా, పశ్చిమ దేశమైనా ఒక నటుడి ప్రయాణంలో ఏ తేడా ఉండదు…’ అని చెప్పాడు తారక్. దీంతో, తన అమెరికన్ యాక్సెంట్ గురించి తప్పుగా మాట్లాడిన వారికి ఇండైరెక్ట్‌గా అయినా మంచి సమాధానమే ఇచ్చాడని మురిసిపోతున్నారు అభిమానులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

