Bubblegum | నల్లగా ఉన్నాడు వీడు హీరో ఏంటి : రోషన్ కనకాల
Bubblegum Movie | టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’ (Bubblegum). రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Bubblegum Movie | టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’ (Bubblegum). రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మానస చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించింది.
ఈవెంట్కు టాలీవుడ్ యువ హీరోలు అడివి శేష్, సిద్దూ జోన్నలగడ్డ, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా వచ్చి సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్లో రోషన్ కనకాల (Roshan Kanakala) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను హీరో అవుదాం అనుకున్నప్పుడు మొట్టమొదటగా నాకు వినిపించిన మాటలు.. కర్రెగా (నల్లగా) ఉన్నాడు. వీడు హీరో ఏంటి.. వీడు హీరో మెటీరియల్ కాదు అంటూ నా వెనుక చాలా కామెంట్స్ వినిపించాయి. అయితే అందరికి నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా. నేను ఇలాగే పుట్టాను. ఇలాగే ఉంటాను. ఒక మనిషి అందం రంగులో ఉండదు. అతడి సక్సెస్ను నలుపు, తెలుపు నిర్ణయించవు. అతడు పడిన కష్టం మాత్రమే విజయాన్ని అందిస్తాయి. మనందరి నసీబ్(తలరాతలో)లో ఏం రాసి ఉందో ఎవరికీ తెలియదు. కానీ మనకు నచ్చినట్లు దాన్ని మార్చుకుంటాం, కావాల్సింది లక్కోని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయిన.. ఔకత్ అయిన అని రోషన్ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#Bubblegum hero, Roshan Kanakala’s response to the people who are trolling him because of his dark skin complexion. pic.twitter.com/OVLgdA48Yn
— Aakashavaani (@TheAakashavaani) December 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

