The World of Mowgli | రోషన్ కనకాల ‘మోగ్లీ’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న రగ్గడ్ లుక్
Mowgli Movie | యువ కథానాయకుడు రోషన్ కనకాల (Roshan Kanakala) తన తాజా చిత్రం 'మోగ్లీ 2025'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Mowgli Movie | యువ కథానాయకుడు రోషన్ కనకాల (Roshan Kanakala) తన తాజా చిత్రం ‘మోగ్లీ 2025’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ గ్లింప్స్‌లో హీరో నాని వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కావడం విశేషం. ఇందులో రోషన్ కనకాల రగ్గడ్ అవతారంలో, పూర్తి కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. కథానాయికగా సాక్షి మడోల్కర్, విలన్‌గా బండి సరోజ్ కుమార్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 2025లో అటవీ నేపథ్యంతో సాగే ఒక ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. అటవీ సన్నివేశాలు, గ్రాఫిక్స్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రామ మారుతి.ఎం, సంగీత దర్శకుడిగా కాలభైరవ పని చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

