ఆ హీరోతో ఛాన్స్ కోసం దేవుడికి మొక్కుకుంటున్న ఎమ్మెల్యే రోజా..
Roja selvamani | తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో 100 సినిమాలకు పైగా నటించిన అనుభవం రోజా సొంతం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది ఈమె. ప్రస్తుతం అధికార వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు రోజా. ఓ వైపు తన నగరి నియోజకవర్గం పనులు చూసుకుంటూనే.. మరోవైపు జబర్దస్త్ కామెడీ షోకి డేట్స్ ఇస్తుంది రోజా. దాంతో పాటు ఈటీవీలో జరిగే స్పెషల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటుంది. దాదాపు 30 ఏండ్ల కెరీర్లో చిన్న హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరితో నటించింది. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ కావడంతో గత తొమ్మిదేండ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. అవకాశాలు వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదు. ఆ మధ్య బాలయ్య సినిమాలో ఒక కీలక పాత్ర కోసం అడిగినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజా ఆ సినిమా ఒప్పుకోలేదు. కేవలం అది మాత్రమే కాదు ఇంకా కొన్ని అవకాశాలు వచ్చినా కూడా ఈమె కాదనుకుంది. ఇదిలా ఉంటే తనకు ఓ హీరోతో నటించాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టింది రోజా. ఆయనతో నటించడానికి ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నాను అంటుంది ఈమె.
అంతేకాదు తన కోరికను ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంది రోజా. ఎప్పటికైనా ఆయన సినిమాలో నటించే అవకాశం ఇప్పించు దేవుడా అంటూ వేడుకుంటుంది రోజా. అంతగా నటించాలని కోరుకుంటుందో తెలుసా..? ఈ తరం సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయనంటే రోజాకు చాలా ఇష్టం. ఈ విషయం ఎన్నోసార్లు చెప్పింది ఈమె. తనకు మహేశ్ బాబు అంటే పిచ్చి అంటూ ఓపెన్ అయిపోయింది రోజా. కృష్ణ గారికి మాత్రమే కాదు మహేశ్ బాబుకి అంతకంటే పెద్ద అభిమానిని అంటూ క్లారిటీ ఇచ్చింది. ఆయనతో నటించే అవకాశం కోసం వేచి చూస్తున్నట్లు చెప్పింది రోజా. మరి ఆ అవకాశం ఈమెకు ఏ దర్శకుడు ఇస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

