Roger Federer | టెన్నిస్ దిగ్గజ ఆటగాడు ‘ఫెదరర్’పై అమెజాన్ ప్రైమ్ డాక్యూమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Roger Federer Documentory | టెన్నిస్ ఆట పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తోచ్చే పేరు రోజర్ ఫెదరర్. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన ఈ స్విస్ దిగ్గజ ఆటగాడు 2022లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు.
Roger Federer Documentory | టెన్నిస్ ఆట పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తోచ్చే పేరు రోజర్ ఫెదరర్. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్‌లను నెగ్గిన ఈ స్విస్ దిగ్గజ ఆటగాడు 2022లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం ప్రస్తుతం కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. అయితే దిగ్గజ ఆటగాడి మీద ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్పోర్ట్స్ విభాగం ఒక డాక్యూమెంటరీని రూపొందిస్తుంది. ఫెదరర్ అనే టైటిల్‌తో ఈ డాక్యూమెంటరీ రానుండగా.. టువెల్ ఫైనల్ డేస్ అనేది ఉప శీర్షిక. ఈ డాక్యూమెంటరీ స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రైమ్ తాజాగా ప్రకటించింది. ఫెదరర్ డాక్యూమెంటరీని జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆసిఫ్ కపాడియా, జో సబియా సంయుక్తంగా ఈ డాక్యూమెంటరీకి దర్శకత్వం వహించారు.
1998లో టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫెదరర్ తన కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్‌లను సాధించాడు. ఇందులో ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, ఎనిమిదిసార్లు వింబుల్డెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకొన్నాడు. ఇక వీటితో పాటు 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో స్వర్ణం పతకం అందుకున్న ఇతడు.. 2012 లండన్ ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో రజతం గెలిచాడు.
One week.@RogerFederer 🎬🍿 pic.twitter.com/9EWvZIQFGM
— Amazon Prime Video Sport (@primevideosport) June 13, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

