Aliya Fakhri | మాజీ బాయ్‌ఫ్రెండ్ మర్డర్ కేసులో నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా అరెస్ట్
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ (Aliya Fakhri) అమెరికాలో అరెస్టయ్యారు. జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మాజీ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని అలియా సజీవ దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Aliya Fakhri | బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరి అలియా ఫక్రీ (Aliya Fakhri) అమెరికాలో అరెస్టయ్యారు. జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మాజీ బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితురాలిని అలియా సజీవ దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నవంబర్ 2న రెండస్తుల గ్యారేజీలో మంటలు అంటుకుని అలియా (43) మాజీ స్నేహితుడు ఎడ్వర్డ్స్ జాకబ్స్, అతని స్నేహితురాలు ఎటీన (33) సజీవదహనం అయ్యారు. అయితే ఆ రోజు ఉదయం జమైకాలోని గ్యారేజీ వద్దకు వచ్చిన అలీనా.. ఈరోజు మీరంతా చనిపోబోతున్నారంటూ అరుస్తూ నిప్పంటించారని డిస్ట్రిక్ట్ అటర్నీ మెలిండా కెట్జ్ కార్యాలయం వెల్లడించింది. ఆ సమయంలో జాకబ్స్, తన స్నేహితురాలు గ్యారేజీ పై అంతస్తులో నిద్రపోతున్నారని వెల్లడించారు. అలీనా అక్కడికి వచ్చినప్పుడు ప్రత్యక్ష సాక్షి చూశారని వెల్లడించారు.

ఏడాది క్రితం అలీనాతో రిలేషన్‌షిప్‌కు జాకబ్స్ ఫుల్స్టాప్ పెట్టారు. అయితే దీనికి ఆమె అంగీకరించలేదని జాకబ్ తల్లి జెన్నెట్ వెల్లడించారు. తన కుమారుడు వడ్రంగిగా పనిచేస్తున్నాడని, గ్యారేజీగా ఉన్న రెండంతస్తుల భవనాన్ని అపార్ట్‌మెంట్‌గా మార్చే పనిలో నిమగ్నమై ఉన్నాడని తెలిపారు. కాగా, రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన రాక్‌స్టార్ సినిమాలో నర్గీస్ ఫక్రీ నటించారు. అయితే ఆమె ఈ ఘటనపై ఇప్పటివరకు స్పందించలేదు. అలియా తల్లి మాత్రం ఒకరిని చంపిందంటే ఇప్పటికీ నమ్మలేనంటున్నది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

